Kurnool: కర్నూలు 5వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పుట్ల రమేష్ నామినేషన్
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ 5వ వార్డు టీడీపీ అభ్యర్థిగా మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో పుట్ల రమేష్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.
Kurnool: కర్నూలు 5వ వార్డు టీడీపీ అభ్యర్థిగా పుట్ల రమేష్ నామినేషన్
కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో నామినేషన్ల కోలాహలం కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు రిటర్నింగ్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ 5వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పుట్ల రమేష్ నామినేషన్ దాఖలు చేశారు.
గత 12 ఏళ్లుగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న తనకు, పార్టీ పనితీరును గుర్తించి టీడీపీ అధిష్ఠానం, స్థానిక మంత్రి టీజీ భరత్ కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కల్పించారని రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, మిత్రపక్షాల సహకారంతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
5వ వార్డులో గెలిచి తన విజయాన్ని మంత్రి టీజీ భరత్తో పాటు టీడీపీ అధిష్ఠానానికి కానుకగా అందిస్తానన్నారు. సమయం తక్కువగా ఉండటంతో తొలుత ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశామని, మరో రోజు గడువు ఉండటంతో అదనంగా మరో సెట్ నామినేషన్ సమర్పిస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజారంజక పాలన తమ విజయానికి పునాదులుగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే, అధికార పార్టీ ప్రతినిధిగా వార్డులో అభివృద్ధి పనులను కళ్లకు కట్టేలా చేపడతానని పుట్ల రమేష్ పేర్కొన్నారు.




