Kurnool: 39వ వార్డు అభివృద్ధే లక్ష్యం: వైసీపీ అభ్యర్థి చిట్టిబాబు!

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ 39వ వార్డు వైసీపీ అభ్యర్థిగా కే. చిట్టిబాబు బరిలోకి దిగారు. ప్రజల మద్దతుతో గెలిచి వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 18 Oct 2026 7:17 PM IST
Kurnool
X

Kurnool: 39వ వార్డు అభివృద్ధే లక్ష్యం: వైసీపీ అభ్యర్థి చిట్టిబాబు!

కర్నూలు: నగరపాలక సంస్థ ఎన్నికల్లో 39వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కే. చిట్టిబాబు పోటీ చేస్తున్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించిన వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా నిలుస్తోందని కే. చిట్టిబాబు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాలనలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడంలో వైసీపీ ముందుంటుందని అన్నారు. తమ కమ్యూనిటీకి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు.

39వ వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని చిట్టిబాబు పేర్కొన్నారు. వార్డులో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.

పార్టీ నాయకుల సహకారం, కార్యకర్తల మద్దతుతో పాటు వార్డు ప్రజల ఆదరణ తనకు అండగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు తనకు ఒకసారి అవకాశం కల్పిస్తే, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కే. చిట్టిబాబు స్పష్టం చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL