Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం!

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులతో కమిషనర్ చల్లా ఓబులేసు సమన్వయ సమావేశం నిర్వహించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 Sept 2026 7:14 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సమావేశం!

Kurnool: త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిద్దామని, అందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం కౌన్సిల్ హాల్లో డీఎస్పీ కె.వి. రాఘవేంద్రతో పాటు నగర పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలతో ఆయన సమావేశమయ్యారు.

ఇటీవల విడుదల చేసిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను పోలీసు అధికారులకు అందజేశారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకంగా మూడు కేటగిరీలుగా విభజించి వివరాలను అందజేయాలని సూచించారు. ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి పంపిస్తామన్నారు.

కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో 487 పోలింగ్ కేంద్రాల పరిధిలో 4,79,861 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా భద్రతా ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, ర్యాంపులు, విద్యుత్ దీపాలు తదితర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.

సమావేశంలో సీఐలు చంద్రబాబు నాయుడు, పి. శేషయ్య, బి.వి. విక్రమసింహా, జి. మారుతి శంకర్, ఎస్‌ఐలు మోహన్ కిషన్ రెడ్డి, యస్. నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL