Kurnool: సర్వజన ఆసుపత్రి అభివృద్ధిపై మంత్రి టీజీ భరత్ సమీక్ష
Kurnool: కర్నూలు సర్వజన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించడంపై మంత్రి టీజీ భరత్, కలెక్టర్ డా. ఏ. సిరి అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది.
Kurnool: సర్వజన ఆసుపత్రి అభివృద్ధిపై మంత్రి టీజీ భరత్ సమీక్ష
కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన, వైద్య సదుపాయాల మెరుగుదల తదితర అంశాలపై సమీక్షించారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులు సూచించారు.
సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తో పాటు వైద్య అధికారులు, సంబంధిత శాఖల అధికారులు హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యులు డాక్టర్ ప్రవీణ్, పి.టి సాయి ప్రదీప్, బైసాని పద్మజ, రామాంజనేయులు, రంగనాథ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.




