Kodumuru: కోడుమూరు వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం - బస్సు, లారీ ఢీ!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు వద్ద ప్రైవేట్ బస్సు, సిమెంట్ లారీ ఢీకొన్నాయి. 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
Kodumuru: కోడుమూరు వద్ద తృటిలో తప్పిన పెను ప్రమాదం - బస్సు, లారీ ఢీ!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో తెల్లవారుజామున తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్తున్న కర్ణాటకకు చెందిన గోటూర్ స్లీపర్ బస్సు, గడివేముల నుంచి బళ్లారి వెళ్తున్న సిమెంట్ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




