Kurnool: కృష్ణాపురంలో ఓ ఇంట్లో భారీ పేలుడు!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కృష్ణాపురంలో ఓ ఇంట్లో భారీ పేలుడు భార్యాభర్తలకు తీవ్ర గాయాలు, ఇంటి గోడలు ధ్వంసం, గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా అనుమానం.
Kurnool: కృష్ణాపురంలో ఓ ఇంట్లో భారీ పేలుడు!
కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామంలో ఓ ఇంట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళన గురిఅయ్యారు. ఇంట్లో ఉన్న భార్యాభర్తలు రాముడు, అయ్యేశ్వరికి గాయాలయ్యాయి.
పేలుడు ధాటికి ఇంటి గోడలు పగుళ్లు ఏర్పడి, ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురు పడిపోయాయి . ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు గాయపడిన భార్యాభర్తలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ ప్రమాదానికి కారణమని బాధితులు చెబుతున్నారు. అయితే పేలుడుకు అసలు కారణం ఏమిటన్నది అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.




