Kodumur: కోడుమూరు 12వ వార్డులో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం!
Kodumur: కర్నూలు జిల్లా కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీ 12వ వార్డులో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గుజరాతీ ప్రవీణ్, వార్డు అభ్యర్థి బి. నాగభూషణ్ రెడ్డి కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Kodumur: కోడుమూరు 12వ వార్డులో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం!
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలుసుకుంటూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా కోడుమూరు 12వ వార్డులో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థి బి. నాగభూషణ్ రెడ్డితో కలిసి సర్పంచ్ అభ్యర్థి గుజరాతీ ప్రవీణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డులోని పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా అని నాగభూషణ్ రెడ్డి వార్డు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
అదేవిధంగా గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి గుజరాతీ ప్రవీణ్ ప్రజలకు వివరించారు. 12వ వార్డు అభ్యర్థి బి. నాగభూషణ్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి గుజరాతీ ప్రవీణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు ఎంపీపీ రఘునాథ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు,కార్యకర్తలు, స్థానిక మద్దతుదారులు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంతో కోడుమూరులో ఎన్నికల సందడి నెలకొంది.




