Kurnool: రేపు కర్నూలు నగరపాలక సంస్థలో అర్జీల స్వీకరణ..కమిషనర్ చల్లా ఓబులేసు!
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థలో సోమవారం 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు వెల్లడించారు.
Kurnool: రేపు కర్నూలు నగరపాలక సంస్థలో అర్జీల స్వీకరణ..కమిషనర్ చల్లా ఓబులేసు!
Kurnool: నగరపాలక సంస్థలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:00 గంటలకు స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. కాలనీల్లో మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పరిశుభ్రత తదితర సమస్యలను ప్రజలు లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని సూచించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు రాలేని పౌరులు 7422992299 నంబర్‌కు కాల్ చేయడం లేదా వాట్సాప్ సందేశం ద్వారా తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని కమిషనర్ సూచించారు.




