Kurnool: టీడీపీ దిగజారుడు రాజకీయాలపై కాటసాని రామభూపాల్ రెడ్డి ఫైర్!
Kurnool: కర్నూలు జిల్లా కల్లూరు మండలం పూసులూరు వైసీపీ సర్పంచ్ అభ్యర్థి స్వామిదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు బలవంతంగా టీడీపీ కండువా కప్పడంపై కాటసాని మండిపడ్డారు.
Kurnool: టీడీపీ దిగజారుడు రాజకీయాలపై కాటసాని రామభూపాల్ రెడ్డి ఫైర్!
కర్నూలు: కల్లూరు మండలం పూసులూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన స్వామిదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పుసులూరు గ్రామంలో టీడీపీ నాయకులకు పోటీ చేసే ధైర్యం లేకపోవడంతోనే తమ టీడీపీ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని కాటసాని పేర్కొన్నారు.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా స్వామిదేవి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు, తాను వైఎస్ఆర్సీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, టీడీపీ నాయకులు అబద్ధపు మాటలు చెప్పి ఎమ్మెల్యే ఇంటికి బలవంతంగా తీసుకెళ్లి టీడీపీ కండువా కప్పారని నూతన సర్పంచ్ స్వామిదేవి వాపోయారు.
తాను వైఎస్ఆర్సీపీ నుంచే సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశానని, తనను టీడీపీలోకి వెళ్లినట్లు ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేశారు. ఏకగ్రీవ ఎన్నికను తమ పార్టీ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ పూసులూరు గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు రామకృష్ణారెడ్డి మరియు గ్రామ ప్రజలు విమర్శలు వ్యక్తం చేశారు.




