Kurnool: కె నాగలాపురం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా గోపాల్ రెడ్డి

Kurnool: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం; టీడీపీ మద్దతుదారుడు గోపాల్ రెడ్డి సర్పంచ్‌గా, వార్డు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 Nov 2026 10:04 PM IST
Kurnool
X

Kurnool: కె నాగలాపురం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం.. సర్పంచ్‌గా గోపాల్ రెడ్డి

కర్నూలు: పంచాయితీ ఎన్నికల వేళ కర్నూలు జిల్లా. కోడుమూరు నియోజకవర్గంలోనీ గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవమయి.ప్రోత్సాహానికి అర్హత సాధించాయి. గూడూరు మండలంలో కె నాగలాపురం, గోపాల్ రెడ్డి, టీడీపీ మద్దతుదారులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లకు , వార్డు సభ్యులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మండల కన్వీనర్ సురేష్, కె నాగలాపురం సర్పంచ్ గోపాల్ రెడ్డి, మాట్లాడుతూ కేడీసీసీ చైర్మన్ ఎదురురూ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎంపీ బస్తిపాటు నాగరాజు సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కే నాగలాపురం గ్రామం ఏకగ్రీవంకు సహకరించిన అన్ని పార్టీలకు, అన్ని వర్గ ప్రజలకు నూతన పాలకవర్గాలు ధన్యవాదాలు తెలిపాయి.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL