Kurnool: ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని ఇండియా కూటమి డిమాండ్

Kurnool: కర్నూలులో ఇండియా కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న సేవ్ డెమోక్రసీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 8 Oct 2026 6:26 PM IST
Kurnool
X

Kurnool: ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని ఇండియా కూటమి డిమాండ్

కర్నూలు: బిజెపి పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఎన్నికల కమిషనర్ను వెంటనే తొలగించాలని ఇండియా కూటమి నాయకులు ఏఐసిసి సభ్యులు, మాజీ డిసిసి అధ్యక్షులు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జే లక్ష్మీనరసింహ యాదవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు.

గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నేతలు మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని బిజెపి రాజ్యాంగాన్ని నాశనం చేస్తుందని బిజెపి ప్రభుత్వానికి జోబు సంస్థగా ఎన్నికల కమిషన్ మారిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాడని వాటిని దుర్వినియోగం చేస్తున్నాడని రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నేత, ఎన్నికల కమిషన్ సభ్యులుగా ఉన్న కమిటీని మార్పులు చేసి ప్రధాని, కేంద్రమంత్రి,

ప్రతిపక్ష నేతతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి మెజార్టీ తీర్మానంతో వారికి అనుకూలంగా జీవోలు అమలు చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కమిషనర్ గా నియమించి వారికి అనుకూలంగా 13 కోట్ల 30 లక్షల ఓట్లు తొలగింప చేశారని ఆ ఓట్లన్నీటిని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలు ముక్తకంఠంతో ఓట్ల దొంగతనం జరుగుతుందని చెప్పినా ప్రధాని మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని వారి గుప్పెట్లో పెట్టుకుని దేశాన్ని పాలించాలని చూస్తున్నారని ఎన్నికల కమిషన్ సభ్యులు జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలను 13సార్లు వ్యతిరేకించారని అయినా జ్ఞానేష్ కుమార్ కు చలనం లేదని ఆయనను వెంటనే తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

జ్ఞానేష్ కుమార్ ను ఎన్నికల కమిషన్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని కేరళలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తించాడని దాదాపు 13 శాతం ఓట్లను ఓటు హక్కు లేకుండా చేశాడని ఇలాంటి వ్యక్తిని ఎన్నికల కమిషన్ నుండి తక్షణమే తొలగించాలని అలాగే కర్నూలు జిల్లాలో 13వ తేదీన సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిదానంతో ఇండియా కూటమి భారీ ప్రదర్శన ర్యాలీ జరుగుతుందని ఈ ర్యాలీకి అందరూ హాజరు కావాలని ఇండియా కూటమి నేతలు పిలుపునిచ్చారు.

ఎన్నికల కమిషనర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ఎంతోమంది ఓటు హక్కును కోల్పోవలసి వస్తుందని ఇలాంటి ఎన్నికల కమిషనర్ ను వెంటనే తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు తెలంగాణలో బిజెపి అభ్యర్థి అరవింద్ ఎన్నికల ప్రచారంలో ఎవరికి ఓటు బటన్ నొక్కిన ఆ ఓటు నాకే పడుతుంది అని బహిరంగంగా ప్రకటించుకున్నారని అలాంటి బిజెపి పాలనలో మనం ఉన్నామని సుధాకర్ బాబు ఎద్దేవ చేశారు.

ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు, కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ యన్ సి బజారన్న, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు డివి సాంబశివుడు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి, ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర ఇన్చార్జి సయ్యద్ ఖాద్రి బాషా, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం సుంకన్న, మాజీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈ లాజరస్, ఐ ఎన్ టి యు సి సి టి అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు విజయభాస్కర్, వార్డు ఇన్చార్జి షబ్బీర్ మొదలగు వారు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL