Kurnool: కేసీ కెనాల్‌లో గుర్రపు డెక్క తొలగింపు: కమిషనర్ ఓబులేసు
Kurnool: కర్నూలు నగర పరిధిలోని కేసీ కెనాల్ వంతెనల పిల్లర్ల వద్ద పేరుకుపోయిన గుర్రపు డెక్కను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
Kurnool: కేసీ కెనాల్‌లో గుర్రపు డెక్క తొలగింపు: కమిషనర్ ఓబులేసు
కర్నూలు: రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్ ఆదేశాల మేరకు నగర పరిధిలోని కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా వంతెనల పిల్లర్ల వద్ద పేరుకుపోతున్న గుర్రపు డెక్కను తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
మంగళవారం ఆయన అశోక్ నగర్, కేవీఆర్ కళాశాల, స్టాంటన్‌పురం, వినాయక ఘాట్, జోహరాపురం వంతెనల ప్రాంతాల్లో జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహం లేనప్పుడే నగర పరిధిలో 90 శాతం గుర్రపు డెక్కను తొలగించామని తెలిపారు. అయితే నీటి ప్రవాహం మొదలయ్యాక ఎగువ ప్రాంతాల్లో ఉన్న గుర్రపు డెక్క తరలివస్తూ నగర పరిధిలోని వంతెనల వద్ద నిలిచిపోతుందన్నారు.
వంతెనల పిల్లర్ల వద్ద గుర్రపు డెక్క పేరుకుపోకుండా హైడ్రాలిక్ ఎక్స్‌కవేటర్ ద్వారా తొలగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ప్రతి వంతెన వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, 2 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని కమిషనర్ వెల్లడించారు.
కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ గిరిరాజ్, డీఈఈ పవన్, కుమార్ రెడ్డి, నరేష్, శ్రీనివాసన్, కృష్ణలత, హెమలత, ఇన్‌స్పెక్టర్లు అనిల్, ఫరూక్, తదితరులు పాల్గొన్నారు.




