Kurnool: కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది దురుసు ప్రవర్తన

Kurnool: కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూతురి అడ్మిషన్ బుక్ అడిగిన న్యాయవాది శివశంకర్ పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. స్థానికుల ఆగ్రహం.

C. Ganesh, Kodumuru
Published on: 1 Oct 2026 7:25 PM IST
Kurnool
X

Kurnool: కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది దురుసు ప్రవర్తన

కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (CHC)లో చికిత్స కోసం వచ్చిన రోగి బంధువుతో ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది.

న్యాయవాది శివశంకర్ తన కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యుల సూచన మేరకు రక్త పరీక్షలు చేయించగా టైఫాయిడ్ ఉన్నట్లు రిపోర్టులో వెల్లడైనట్లు తెలిపారు. దీంతో కుమార్తెను ఆసుపత్రిలో చేర్పించేందుకు అడ్మిషన్ బుక్ ఇవ్వాలని అక్కడి సిబ్బందిని కోరినట్లు చెప్పారు.

అయితే, అడ్మిషన్ బుక్ ఇవ్వాలని అడిగినందుకు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది తనతో దురుసుగా మాట్లాడారని శివశంకర్ ఆరోపించారు. అడగడానికి నువ్వెవరు అంటూ సిబ్బంది మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి బంధువులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru