Kurnool: సమ్మాతగేరి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా గాదిలింగ నామినేషన్!
Kurnool: కర్నూలు జిల్లా హోల్లగుంద మండలం సమ్మాతగేరి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గాదిలింగ ఆదివారం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Kurnool: సమ్మాతగేరి వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా గాదిలింగ నామినేషన్!
కర్నూలు: కర్నూలు జిల్లా హోల్లగుంద మండలం సమ్మాతగేరి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి గాదిలింగ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి,సీనియర్ న్యాయవాది బైటింటి లక్ష్మీకాంత్ పాల్గొని గాదిలింగ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గాదిలింగ మాట్లాడుతూ, సమ్మాతగేరి గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలను పరిష్కరించి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




