Kurnool: ఎమ్మెల్యే విరూపాక్షికి హైకోర్టులో బెయిల్ ఊరట

Kurnool: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

Bheemalinga, Aluru
Published on: 8 Oct 2026 6:31 PM IST
Kurnool
X

Kurnool: ఎమ్మెల్యే విరూపాక్షికి హైకోర్టులో బెయిల్ ఊరట

కర్నూలు: కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నెమకల్ గ్రామంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఎమ్మెల్యే విరూపాక్షిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

ఈ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు రిమాండ్‌కు తరలించగా... దాదాపు 68 రోజుల పాటు ఆయన జైలులో ఉన్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్యే విరూపాక్షికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఎమ్మెల్యేకు బెయిల్ మంజూరు కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు పలుచోట్ల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru