Gudur: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా!

Gudur: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు కర్నూలు ఆర్డీవో సందీప్ ప్రకటించారు.

C. Ganesh, Kodumuru
Published on: 23 Nov 2026 1:52 PM IST
Gudur
X

Gudur: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా!

గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సోమవారం నిర్వహించాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కర్నూలు ఆర్డీవో సందీప్ ప్రకటించారు. గూడూరు నగర పంచాయతీలో మొత్తం 23 మంది వార్డు సభ్యులు ఉండగా, వారిలో టీడీపీకి 11 మంది, వైసీపీకి 8 మంది, బీజేపీకి ఒకరు, జనసేనకు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు.

అయితే వైసీపీకి చెందిన వార్డు సభ్యులు మినహా మిగిలిన పార్టీలకు చెందిన సభ్యులందరూ ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో కోరం పూర్తికాకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికను అధికారులు రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గూడూరు నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru