Kurnool: డా. నాగస్వామి నాయక్‌కు “బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్” అవార్డు!
Kurnool: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో కర్నూలు బి.క్యాంప్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్‌కు బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు.
Kurnool: డా. నాగస్వామి నాయక్‌కు “బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్” అవార్డు!
కర్నూలు: బి.క్యాంప్‌లోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డా. ఎస్. నాగస్వామి నాయక్‌కు “బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు” లభించింది.
రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు ఆధ్వర్యంలో 57వ NSS డే వేడుకల్లో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఈ అవార్డును ప్రదానం చేశారు. NSS కార్యక్రమాల ద్వారా సమాజ సేవ, యువతలో సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అవగాహన కార్యక్రమాలు, NSS వాలంటీర్ల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినందుకు డా. ఎస్. నాగస్వామి నాయక్‌కు ఈ పురస్కారం అందించారు.
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 51 NSS కేంద్రాల్లో పనిచేస్తున్న ప్రోగ్రామ్ ఆఫీసర్లలో డా. ఎస్. నాగస్వామి నాయక్‌కు “బెస్ట్ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్” అవార్డు రావడం విశేషమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ అవార్డును NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. బి. కవిత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. విజయ్ కుమార్ నాయుడు, వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ శ్రీమతి వెంకట బసవ రావు చేతుల మీదుగా ప్రదానం చేశారు.
డా. ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, NSS ద్వారా విద్యార్థుల్లో సేవా భావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ఈ అవార్డు మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రేరణనిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల staff, NSS వాలంటీర్లు, విద్యార్థులు డా. ఎస్. నాగస్వామి నాయక్‌ను అభినందించారు.




