Kurnool: పెన్షన్ అర్హులకు తక్షణమే న్యాయం చేయాలి: గద్వాల రవి నాయుడు!
Kurnool: ఫ్యామిలీ మ్యాపింగ్‌తో వృద్ధుల పెన్షన్లకు గండి కొట్టొద్దు: గోనెగండ్ల ఎమ్మార్వోకు బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గద్వాల రవి నాయుడు వినతిపత్రం అందజేత.
Kurnool: పెన్షన్ అర్హులకు తక్షణమే న్యాయం చేయాలి: గద్వాల రవి నాయుడు!
కర్నూలు: అర్హత ఉన్నప్పటికీ ఫ్యామిలీ మ్యాపింగ్ నిబంధన కారణంగా పెన్షన్ పొందలేకపోతున్న వృద్ధులకు వెంటనే న్యాయం చేయాలని రైతు నాయకుడు గద్వాల రవి నాయుడు, బీజేపీ సినియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పద్మావతి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజలతో కలిసి గోనెగండ్ల ఎమ్మార్వోను కలిసి ఈ సమస్యపై వినతిపత్రం సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ మ్యాపింగ్‌ను రద్దు చేసినప్పటికీ, సచివాలయ స్థాయిలో పెన్షన్ దరఖాస్తులను నమోదు చేసే సమయంలో సర్వర్‌లో ఫ్యామిలీ మ్యాపింగ్ సమస్య కొనసాగుతున్న కారణంగా అర్హులైన అనేకమంది పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రవి నాయుడు తెలిపారు.
60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన వృద్ధులు పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్లినా, కుటుంబంలో ఇప్పటికే ఒకరికి పెన్షన్ వస్తోందన్న కారణంతో పలువురిని వెనక్కి పంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిబంధనలను సడలించినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు జరగకపోవడంతో అర్హులైన వృద్ధులు నిరాశతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అర్హత ఉన్న ప్రతి వృద్ధుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సర్వర్‌లో ఉన్న ఫ్యామిలీ మ్యాపింగ్ సమస్యను వెంటనే తొలగించి, పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైన వారికి మరోసారి అవకాశం కల్పించాలని ఎమ్మార్వోను కోరారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరినప్పుడే వాటి ఉద్దేశం నెరవేరుతుందని రవి నాయుడు పేర్కొన్నారు. ఈ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కులమాల, గోనెగండ్ల గ్రామాలకు చెందిన పెన్షన్ లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




