Kurnool: కర్నూలులో భగత్ సింగ్ జయంతి వేడుకలు
Kurnool: కర్నూలులో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి. భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, సీఈసీ రాజీనామా చేయాలని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నిరసన.
Kurnool: కర్నూలులో భగత్ సింగ్ జయంతి వేడుకలు
కర్నూలు: స్వాతంత్ర సమరయోధుడు యువత గర్వించతగ్గ నాయకుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా చెన్నమ్మ సర్కిల్లో భగత్ సింగ్ విగ్రహానికి విద్యార్థి యువజన సంఘాల నాయకులు కార్యకర్తలు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నమ్మ సర్కిల్ లో ఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు హుస్సేన్ భాష అధ్యక్షతన చేపట్టారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర,అబ్దుల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు,రంగప్ప మాట్లాడారు నేడు దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాల రాస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందన్నారు. దేశ పౌరుల ఓట్లు ఎస్ ఐ ఆర్ పేరుతో గల్లంతు చేస్తూ పౌరులకు ఓటు హక్కు లేకుండా చేయాలని చూస్తుందన్నారు.
కేంద్ర ఎన్నికల అధికారి కేంద్ర ప్రభుత్వానికి గుమస్తాగ పనిచేస్తున్నాడని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఏకపక్షంగా అవినీతిమయంగా మారుస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో యువకుల ఐక్యత ఈ దేశానికి అవసరమని ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ యువతపై ఉందని భగత్ సింగ్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని అందరం కలిసి కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.
భగత్ సింగ్ అతి చిన్న వయసులో ఈ దేశ స్వాతంత్రం కోసం అభివృద్ధి కోసం సమాజ మార్పు కోసం ప్రాణాలర్పించాడని తెలియజేశారు. అలాగే దేశాభివృద్ధి కోసం యువత కదిలి రావాలని ప్రతి సమస్యలో యువత జోక్యం చేసుకోవాలని తెలియజేశారు. ఈ
కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్ జిల్లా నాయకులు హరి కిషన్ రెడ్డి నగర నాయకులు సుకన్య,విజయ్,వీరేశ్,మహేష్, శివ శంకర్,ప్రకాష్,కృపావరం, నారాయణ,గుండాల్,రాజు, హేమంత్,రంగ రాజు, సురేష్ ఎస్ఎఫ్ఐ నాయకులు అమర్ ,యోగి, ఉదయ్ , పృధ్వి తదితరులు పాల్గొన్నారు




