Kurnool: ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కోడుమూరులో భారీ పోలీసు బందోబస్తు!

Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిషత్ అధ్యక్షుడు (MPP) ఎన్నిక నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

C. Ganesh, Kodumuru
Published on: 19 Nov 2026 12:22 PM IST
Kurnool
X

Kurnool: ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో కోడుమూరులో భారీ పోలీసు బందోబస్తు!

కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు మండల పరిషత్ అధ్యక్షుడు (MPP) ఎన్నిక నేపథ్యంలో మండలంలో ఉత్కంఠ నెలకొంది. MPP పీఠాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కోడుమూరు మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) 10 స్థానాలు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 9 స్థానాలు, సీపీఎం ఒక స్థానం, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో MPP అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా కోడుమూరు సీఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. కోడుమూరు MPP ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందోనని స్థానికులు, రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru