Devanakonda: జేసీ చొరవతో మూడు రోజుల్లోనే లక్కందిన్నె తాగునీటి సమస్యకు పరిష్కారం!
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లక్కందిన్నె గ్రామంలో 45 రోజులుగా ఉన్న తాగునీటి సమస్యను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మూడు రోజుల్లోనే పరిష్కరించడంతో ప్రజా సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Devanakonda: జేసీ చొరవతో మూడు రోజుల్లోనే లక్కందిన్నె తాగునీటి సమస్యకు పరిష్కారం!
కర్నూలు: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లక్కందిన్నె గ్రామంలో సుమారు 45 రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను వాట్సాప్ ద్వారా జాయింట్ కలెక్టర్ శ్రీ నూరుల్ ఖమర్, ఐ.ఏ.ఎస్. గారి దృష్టికి తీసుకెళ్లిన కేవలం మూడు రోజుల్లోనే స్పందించి, గ్రామంలో కొత్త బోరు వేయించి ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని రాయలసీమ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు వి.వి. నాయుడు, రవికుమార్,మదాసికురువ సుంకన్న, పి.జి.వెంకటేష్ లు అన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్నపాటి సత్కారం నిర్వహించారు. ప్రజల సమస్యలను వేగంగా గుర్తించి, క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపించిన జాయింట్ కలెక్టర్ చొరవ, స్పందన ప్రభుత్వ అధికారుల్లో ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తుందని నాయకులు ప్రశంసించారు.
అదే సమయంలో లక్కందిన్నె గ్రామానికి ఉన్న మరో ప్రధాన సమస్యను కూడా జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. పాలకుర్తి గ్రామం మీదుగా ఉన్న ఏకైక రహదారికి ఇరువైపులా ముళ్ల కంపలు విపరీతంగా పెరిగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, కొందరికి కళ్ళకు కొట్టుకోవడం, ముళ్ళు గీసుకుపోయి గాయాలు అవ్వడం జరుగుతుంది అన్నారు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు దారి ఇవ్వలేని పరిస్థితి ఉందని, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకఅ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వివరించారు.
ఈ సమస్యపై ఇప్పటికే రెండుసార్లు పి.జి.ఆర్.యస్.లో ఫిర్యాదు చేసినప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో వెంటనే ముళ్ల కంపలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జె.సి. స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు ఈ కార్యక్రమంలో.. నాయకులు హరిగౌడ్, కురువ రమేష్, భరత్ కుమార్, వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.




