Kurnool: ఆలూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి విజయ్ ఎన్నికల ప్రచారం!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి మద్దతుతో బరిలో నిలిచిన విజయ్ ఉపాధి హామీ కూలీలను కలిసి తనను గెలిపించాలని కోరారు.
Kurnool: ఆలూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి విజయ్ ఎన్నికల ప్రచారం!
కర్నూలు: కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకులు మాట్లాడు తూ ఆలూరు పట్టణంలో ప్రధానంగా నెలకొన్న తాగునీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపిస్తే, పట్టణంలోని సమస్యలన్నింటినీ టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మేడం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
ఆలూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.




