Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవాల తేదీలు ఖరారు - అక్టోబర్ 21న కర్రల సమరం!
Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల (కర్రల సమరం) షెడ్యూల్ ఖరారైంది. అక్టోబర్ 21న అర్ధరాత్రి ఈ ప్రత్యేక ఉత్సవం నిర్వహించనున్నారు.
Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవాల తేదీలు ఖరారు - అక్టోబర్ 21న కర్రల సమరం!
Kurnool: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు కసరత్తు వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో.. కూటమి పార్టీల రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై స్థానిక ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు సమాచారం.
ఈ సమావేశంలో టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం కీలకంగా మారిన నేపథ్యంలో.. ముందుగా రిజర్వేషన్లు ఖరారు కావాలని, ఆ తర్వాతే అభ్యర్థుల ఎంపిక, స్థానాల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే ఏ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందని కూటమి నేతలు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అభ్యర్థుల పేర్ల కంటే.. పార్టీల బలాబలాలు, స్థానిక పరిస్థితులు, రిజర్వేషన్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే స్థానిక ఎన్నికల్లో జనసేన బలంగా ఉందని భావిస్తున్న స్థానాల వివరాలను ముందుగానే ఇవ్వాలని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు కోరినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో గత ఎన్నికల ఫలితాలు, పార్టీకి ఉన్న కేడర్ బలం, స్థానిక నాయకత్వం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీట్ల సర్దుబాటుపై చర్చించే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి కీలక స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో.. మూడు పార్టీల మధ్య సమన్వయం ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ సంస్థల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో స్థానిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రిజర్వేషన్లపై తుది స్పష్టత వచ్చిన వెంటనే నియోజకవర్గాల వారీగా పార్టీలు తమకు అనుకూలమైన స్థానాలపై ప్రతిపాదనలు ఇవ్వనున్నాయి. అనంతరం కూటమి సమన్వయ కమిటీ వాటిపై చర్చించి సీట్ల పంపకానికి ఒక రూపం ఇవ్వనుంది. గురువారం మరోసారి సమన్వయ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.
రిజర్వేషన్ల ఖరారు తర్వాతే స్థానిక ఎన్నికల అసలు రాజకీయ కసరత్తు ప్రారంభం కానుంది. మూడు పార్టీల్లో ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారు? ఏ స్థానాన్ని ఏ పార్టీకి కేటాయించాలి? స్థానిక నేతల అభిప్రాయాలను ఎలా పరిగణనలోకి తీసుకోవాలి? అన్న అంశాలపై తదుపరి భేటీల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




