Devanakonda: దేవనకొండ సర్పంచ్ పీఠంపై హోరాహోరీ.. నలుగురి మధ్య పోరు!
Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో సర్పంచ్ పీఠంపై నలుగురు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇంటింటి ప్రచారంతో గ్రామంలో రాజకీయ వేడి రాజుకుంది.
Devanakonda: దేవనకొండ సర్పంచ్ పీఠంపై హోరాహోరీ.. నలుగురి మధ్య పోరు!
దేవనకొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో సర్పంచ్ ఎన్నికల పోరు రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. గ్రామ పంచాయతీ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా నలుగురు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఈ ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ మద్దతుతో కట్ట వేణుగోపాల్, వైఎస్సార్సీపీ తరఫున ఎర్రకోటి అంజి, సీపీఐ పార్టీ నుంచి ఎం. నరసారావు, స్వతంత్ర అభ్యర్థిగా మిఠాయి వేణుగోపాల్ పోటీ పడుతున్నారు.
నలుగురు అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తూ తమ ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గ్రామాభివృద్ధికి తామే సరైన నాయకులమంటూ ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఆశీస్సులు తీసుకుంటూ, తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.




