Kurnool: ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు నేడే బీ-ఫారాలు సమర్పించేందుకు తుది గడువు!
Kurnool: పత్తికొండ, దేవనకొండ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు నేడు కీలక గడువు. మధ్యాహ్నం 3 గంటలలోపు బీ-ఫారాలు, నామినేషన్ల ఉపసంహరణకు తుది సమయం.
Kurnool: ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు నేడే బీ-ఫారాలు సమర్పించేందుకు తుది గడువు!
Kurnool: నామినేషన్ల ఉపసంహరణకూ ఇదే చివరి గడువు దేవనకొండ: మండల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేడు కీలకమైన రోజని రిటర్నింగ్ అధికారి ఆర్.ఎల్. ప్రకాష్ తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలలోపు రాజకీయ పార్టీ అభ్యర్థులు తమ బీ-ఫారాలను సమర్పించాలని సూచించారు. నిర్ణీత గడువులోగా బీ-ఫారాలు సమర్పించని అభ్యర్థులను రాజకీయ పార్టీ అభ్యర్థులుగా గుర్తించడం సాధ్యం కాదని, ఎన్నికల నిబంధనల ప్రకారం వారు స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించబడే అవకాశం ఉందని స్పష్టం చేశారు.అదేవిధంగా, ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవాలనుకునే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరణ పత్రాలను కూడా నేడు మధ్యాహ్నం 3 గంటలలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు.
నామినేషన్లను ఉపసంహరించుకోవాలనుకునే అభ్యర్థులు నిర్ణీత విధానంలో ఉపసంహరణ పత్రాన్ని సమర్పించి తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చని ఆర్.ఎల్. ప్రకాష్ పేర్కొన్నారు.కావున, పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు గడువును దృష్టిలో ఉంచుకుని అవసరమైన పత్రాలను సకాలంలో సమర్పించాలని రిటర్నింగ్ అధికారి సూచించారు




