Kurnool: కర్నూలు – మచిలీపట్నం రైలు సమయాలు మార్చాలి

Kurnool: కర్నూలు-మచిలీపట్నం రైలును పునరుద్ధరించడంపై సీపీఎం ధన్యవాదాలు తెలిపింది. ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు నడిపేలా సమయాలు మార్చాలని డీఆర్‌‌ఎంకు వినతిపత్రం ఇచ్చింది.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Sept 2026 9:07 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలు – మచిలీపట్నం రైలు సమయాలు మార్చాలి

కర్నూలు: కర్నూలు నుండి మచిలీపట్నం రైలును పునరుద్దరించిన దక్షిణ మద్య రైల్వే అధికారులకు సిపియం జిల్లా కమిటి ధన్యవాదాలు తెలియజేస్తున్నదని సిపియం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ తెలిపారు. ఇన్ని రోజులు తరువాతనైనా మా కర్నూలు ప్రజల కోరికను కొంతవరకు నెరవేర్చినందుకు మరొకసారి రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు.

ఈ రోజు సిపియం జిల్లా ప్రతినిధి బృందం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌తో పాటు సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.యస్.రాధాక్రిష్ణ, టి.రాముడు, యం.డి ఆనంద్ బాబు కలిసి దక్షిణమద్య రైల్వే జనర రైల్వే జనరల్ మేనేజర్ గారికి కర్నూలు స్టేషన్ మేనేజర్ ద్వారా ఒక వినతి పత్రాన్ని పంపించారు.

ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ కర్నూలు నుండి మచిలీపట్నానికి వారంలో మÖడు రోజులు మాత్రమే కేటాయించడం సరైనది కాదని సిపియం పార్టీ బావిస్తున్నదని ఆయన తెలిపాడు. అలాగే బయలుదేరే సమయాన్ని చూస్తే కర్నూలు నగర ప్రజలు విజయవాడకు వెళ్ళడానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదని ఆయన తెలిపాడు. దాదాపు 13 గంటలకు ప్రయాణ సమయాన్ని పెట్టడం కూడా ప్రజలకు ఇబ్బంది కరంగా ఉంటుందన్నారు.

ఇపుడు రైల్వే అధికారులు ప్రకటించినట్లు రైలు నడిపితే కర్నూలు నగర ప్రజలకు ప్రయోజనం ఏమిలేదు. రైల్వే అధికారుల తీరు ఎలా ఉందంటే ప్లేట్లో అన్నంపెట్టి చేతులు కట్టేసిన విధంగా ఉన్నదని ఆయన తెలిపాడు. అందువల్ల రైల్వే అధికారులు మచిలీపట్నం వెళ్ళే రైలును రెగ్యులర్ రైలుగా మార్చాలని, కేటాయించిన సమయం కూడా మార్చాలని, కర్నూలు నుండి ప్రతిరోజు సాయంత్ర 7 గంటలకు బయలు దేరేలా సమయాన్ని మార్చాలని, విజయవాడకు వెళ్ళే సమయాన్ని ఉదయం పెట్టడంవల్ల ఎవరికి ప్రయోజనం లేదని ఆయన తెలిపాడు.

ప్రయాణ సమయాన్ని కుదించాలని, విజయవాడకు ఉదయం 6 గంటలకు చేరేలా సమయాన్ని మార్చాలని వారు కోరారు. అలా చేయడంవల్ల కర్నూలు ప్రజలకు రాజదానికి వెళ్ళడానికి కొంతవరకైన ఉపశమనం కలుగుతుందని తెలియజేస్తున్నామని అన్నారు. అలాగే కాచిగూడ నుండి గుంటూరు వరకు వెళ్ళే రైలును విజయవాడ వరకు పొడిగించాలని విజయవాడ జోన్, సికింద్రబాద్ జోన్ అధికారులు చర్చించుకొని త్వరగా నిర్ణయం చేయాలని ఆ రకంగా చేయడంవల్ల కర్నూలు నగర ప్రజలు విజయవాడకు వెళ్ళడానికి బస్సులపై ఆధారపడకుండా నివారించినవాళ్ళమవుతామని ఆయన రైల్వే అధికారులకు కోరారు. ఆలా చేయకపోతే భవిషత్తులో ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించాడు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL