Kurnool: మొల్లగవల్లి సీపీఐ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొల్లగవల్లి గ్రామంలో సీపీఐ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం. వామపక్షాలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.
Kurnool: మొల్లగవల్లి సీపీఐ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొల్లగవల్లి గ్రామంలో సిపిఐ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ అభ్యర్థి వీరేష్, ఎంపీటీసీ-1 అభ్యర్థి భూపేష్, ఎంపీటీసీ-2 అభ్యర్థి కృష్ణవేణి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో వామపక్ష పార్టీలే ఎప్పుడూ ముందుంటాయని పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అధికారులను, రాజకీయ నాయకులను ఎదిరించి పోరాడేది వామపక్ష పార్టీలేనని అన్నారు.
ప్రజల సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. మొల్లగవల్లి గ్రామ ప్రజలు తమను ఆదరించి సిపిఐ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తమను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని అభ్యర్థులు హామీ ఇచ్చారు.




