Kurnool: దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు..కమిషనర్!

Kurnool: కర్నూలు తుంగభద్ర నది సంకల్‌బాగ్‌ ఘాట్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 11 Oct 2026 3:34 PM IST
Kurnool
X

Kurnool: దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు..కమిషనర్!

Kurnool: ఈ నెల 21న దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.

ఆదివారం తుంగభద్ర నది వద్ద సంకల్‌బాగ్‌లోని దుర్గామాత ఘాట్‌ను పరిశీలించారు. గుర్రపు డెక్క తొలగింపు, పారిశుద్ధ్య పనులు, మెటల్ రోడ్డు నిర్మాణం, జంగిల్ క్లియరెన్స్ పనులను వెంటనే చేపట్టాలని, క్రేన్లు, విద్యుత్ దీపాలు, వేదిక, తాగునీటి సరఫరా ఏర్పాట్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీఈఈలు పవన్ కుమార్ రెడ్డి, నరేష్, ఏఈ జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL