Kurnool: కర్నూలు జిల్లాలో చెత్త నుంచి సంపద కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్!
Kurnool: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె.నాగలాపురం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తనిఖీ చేశారు. తడి పొడి చెత్త వేర్పాటుపై అధికారులకు ఆదేశాలు.
Kurnool: కర్నూలు జిల్లాలో చెత్త నుంచి సంపద కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్!
Kurnool: గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, తడి–పొడి వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం గూడూరు మండలం కె. నాగలాపురం గ్రామ పంచాయతీలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని (SWPC) జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి గ్రామంలో సేకరిస్తున్న తడి, పొడి చెత్తను వేరు చేయడం, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేయడం, వర్మీకంపోస్ట్ తయారీ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...గ్రామంలో పారిశుధ్య కార్మికులు, క్లాప్ మిత్రుల ద్వారా ఇంటింటి నుంచి సేకరిస్తున్న చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్లాస్టిక్ సీసాలు, గాజు సీసాలు, కాగితాలు తదితర పొడి వ్యర్థాలను ప్రత్యేకంగా వేరు చేసి స్టోర్ రూమ్‌లో భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వాటిని రీసైక్లింగ్‌కు సంబంధించిన వ్యాపారులకు విక్రయించాలని సూచించారు.
ప్రతిరోజూ సేకరిస్తున్న తడి చెత్తను ప్రత్యేక పిట్లలో శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి వర్మీకంపోస్ట్‌గా మార్చుతున్న విధానాన్ని, వ్యర్థాల వేర్పాటు, పునర్వినియోగ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో 12 వర్మీకంపోస్ట్ పిట్ల ద్వారా నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేస్తూ, నెలకు సుమారు రూ.15 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని చెత్తను సంపదగా మార్చడంతో పాటు, వర్మీకంపోస్ట్, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలని కలెక్టర్ సూచించారు. లైవ్‌స్టాక్, అనుబంధ రంగాల ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.




