Kurnool: కోడుమూరులో పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించి, పారదర్శక ఏర్పాట్లకు ఆదేశించారు.
Kurnool: కోడుమూరులో పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ!
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు, ప్రక్రియ నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నామినేషన్ల ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యాలయంలో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ, ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.




