Kurnool: రీ-సర్వే పనుల్లో పురోగతిని వేగవంతం చేయాలి డా. ఏ. సిరి!

Kurnool: కర్నూలు జిల్లాలో రీ-సర్వే పనులు, గృహ నిర్మాణాలు మరియు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 Sept 2026 5:06 PM IST
Kurnool
X

Kurnool: రీ-సర్వే పనుల్లో పురోగతిని వేగవంతం చేయాలి డా. ఏ. సిరి!

Kurnool: నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనులలో పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సర్వే, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

బుధవారం రెవెన్యూ, హౌసింగ్ సైట్ తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ రీ-సర్వే పనులపై ప్రత్యేక దృష్టి సారించి, విలేజ్ సర్వేయర్, వీఆర్వో లాగిన్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు పురోగతి సాధించాలని కలెక్టర్ సర్వే ఏడి ని ఆదేశించారు. ముఖ్యంగా ఫేజ్-3లో పెండింగ్‌లో ఉన్న DLRలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు, ఫేజ్-4 పనులను తహశీల్దార్ లాగిన్ స్థాయి నుంచి వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. అదే విధంగా 44 గ్రామాలకు సంబంధించిన ఫేజ్-6 రీ-సర్వే పనుల్లో సుమారు 8,000 ఎకరాలలో గ్రౌండ్ ట్రూథింగ్‌ పూర్తైన నేపథ్యంలో, మిగిలిన పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సర్వే అధికారులను ఆదేశించారు.

బల్క్ ఇష్యూస్, ఈ-ఆఫీస్, 22ఏ భూములు, ఏపీఐఐసి కి సంబంధించిన మ్యుటేషన్ తదితర అంశాలపై ఇప్పటివరకు జరిగిన పురోగతి గురించి తెలుసుకొని కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.. ఏపీఐఐసి కి సంబంధించిన మ్యుటేషన్‌కు సంబంధించిన మార్పులను వెబ్‌ల్యాండ్‌లో కూడా తప్పనిసరిగా నమోదు చేసి, అప్‌డేట్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

హౌసింగ్ కి సంబంధించి జిల్లాలో గృహ నిర్మాణానికి సంబంధించిన ఖాళీ స్థలాలు, అర్హులైన లబ్ధిదారులు, నిర్మాణాల పురోగతిపై సమగ్ర వివరాలను వారం రోజుల్లోగా సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు.. ప్రతి లేఅవుట్‌లో హౌస్‌ సైట్‌ ఎవరికి కేటాయించారు, సదరు లబ్ధిదారు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నారా, స్థలం ఖాళీగా ఉందా, నిర్మాణం ప్రారంభించారా, పాక్షికంగా పూర్తయిందా లేదా పూర్తిగా పూర్తయిందా అనే వివరాలను ఎన్యూమరేట్‌ చేసి నమోదు చేయాలన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌస్‌ సైట్లను గుర్తించి, కొత్తగా హౌస్‌ సైట్‌కు అర్హత కలిగిన, నిర్మాణానికి సిద్ధంగా ఉన్న లబ్ధిదారులను వాటికి అనుసంధానం చేయాలన్నారు. అర్హులైన వారికి కేటాయించేందుకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేని పక్షంలో, అవసరమైన భూసేకరణ (Land Acquisition) చేపట్టేందుకు ఎంత భూమి అవసరం, ఎన్ని ఎకరాలు అవసరం, అందుకు ఎంత నిధులు అవసరమవుతాయనే వివరాలను సేకరించాలన్నారు.

అనంతరం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ బల్క్ ఇష్యూస్, ఈ-ఆఫీస్, 22ఏ భూములు, ఏపీఐఐసి కి సంబంధించిన మ్యుటేషన్, రీ సర్వే, హౌసింగ్ తదితర అంశాలపై తహసిల్దార్ లతో క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించి, పురోగతి గురించి ఆరా తీసి తహసిల్దార్ లకు పలు ఆదేశాలు జారీ చేశారు.

టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ , కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL