Kurnool: ప్యాలకుర్తి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో భోజనం చేసిన బీజేపీ నేతలు

Kurnool: కర్నూలు జిల్లా ప్యాలకుర్తి పాఠశాలను బీజేపీ, బీజేవైఎం నేతలు సందర్శించారు. స్కూల్ గ్రౌండ్ ఆక్రమణపై స్పందించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 6 Oct 2026 5:33 PM IST
Kurnool
X

Kurnool: ప్యాలకుర్తి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో భోజనం చేసిన బీజేపీ నేతలు

కర్నూలు: BJYM రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు కేశవ సూచన మేరకు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలో పర్యటించిన BJP(BJYM) కర్నూలు జిల్లా RTI సెల్ కన్వినర్ & జనసేవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరు రాజు యాదవ్,అనంతరం గ్రామంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ ని సందర్శించి టీచర్స్ తో మరియు 10వ తరగతి విద్యార్థులతో సమావేశం అయ్యి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

స్కూల్ కి సంబందించిన గ్రౌండ్ ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారు అని అని టీచర్స్ నా దృష్టికి తీసుకుని వచ్చారు,త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డీంచి,విద్యార్థులతో కలిసి భోజనం చెయ్యడం జరిగింది.

కార్యక్రమంలో స్థానిక BJP నాయకులు సోమన్న యాదవ్,భాస్కర్ యాదవ్,మహేష్ యాదవ్,వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL