Kurnool: సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండెంట్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేవైఎం

Kurnool: కర్నూలు జిల్లా కే.నాగలాపురం సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నేత హేమేష్ కుమార్ డిమాండ్ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Sept 2026 3:00 PM IST
Kurnool
X

Kurnool: సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండెంట్‌పై చర్యలు తీసుకోవాలి: బీజేవైఎం

కర్నూలు జిల్లా: అవుట్ రిచ్ విభాగం అధ్యక్షులు BJYM రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,BJYM జిల్లా అధ్యక్షులు కేశవ రామ్ చౌదరి సూచన మేరకు కర్నూలు జిల్లా గూడూరు మండలం K.నాగలాపురం గ్రామంలో ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండంట్ దివ్య బాల జ్యోతి మీద క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి అని BJYM నేత హెమేష్ డిమాండ్ చేశారు.

సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండంట్ జ్యోతి హిందువులు రాళ్లు రప్పలను పూజిస్తారు,హిందూ దేవుళ్ళు కేవలం రాళ్లు మాత్రమే అని హిందూ దేవుళ్ళని హిందూ మతాన్ని దుసించడం సిగ్గు చేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు, కరెస్పాండంట్ జ్యోతికి హిందూ దేవుళ్ళు అంటే ఎందుకు అంత ద్వేషం అని హెమేష్ ఫైర్ అయ్యారు.

కొద్దిరోజుల క్రితం స్కూల్ లో చదివే 10 వ తరగతి కి చెందిన హిందూ,ముస్లిం విద్యార్థులను బలవంతంగా మైసూర్ చర్చి కి తీసుకుని వెళ్లి బలవంతంగా బైబిల్ చదివించటం,జీసస్ గురించి ప్రేయర్ చేయించటం వంటివి చేశారు అని తెలిపారు,చదువులు చెప్పాల్సిన కరెస్పాండంట్ జ్యోతి ఇలా విద్యార్థులను మతం మార్చడానికి ప్రయత్నం చెయ్యడం ఎంతవరకు సమంజసం అని అయన తెలిపారు.

మేము కూడా సిస్టర్స్ ని అయోధ్య, ద్వారకా లాంటి పుణ్యక్షేత్రలకు మా సొంత ఖర్చులు పెట్టి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము సిస్టర్స్ అందుకు అంగీకరించాలి అని డిమాండ్ చేశారు,హిందూ విద్యార్థులను బలవంతంగా చర్చికి తీసుకుని వెళ్లారు కనుక అక్కడ ఉండే సిస్టర్స్ కూడా మా పుణ్యక్షేత్రలకు మరియు మస్జీద్ లకు వచ్చి ప్రార్ధనలు చెయ్యాలి అని డిమాండ్ చేశారు, కావున సెయింట్ జోసెఫ్ స్కూల్ కరెస్పాండంట్ జ్యోతి మీద మరియు ప్రిన్సిపాల్ ఫిలిప్ వెంటనే పోలీసు డిపార్ట్మెంట్ వారు క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి అని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో హిందూ సంఘాలతో కలిసి వేలాదిమంది హిందూ కార్యకర్తలతో కలిసి ఛలో నాగలాపురం కార్యక్రమం నిర్వహిస్తామని BJYM నేత హెమేష్ హెచ్చరించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL