Kurnool: జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు విద్యార్థి ఎంపిక!

Kurnool: కర్నూలు బి. క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సరం విద్యార్థి టి. వేణుగోపాల్ జాతీయ స్థాయి అండర్-19 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 Nov 2026 11:41 AM IST
Kurnool
X

Kurnool: జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కర్నూలు విద్యార్థి ఎంపిక!

కర్నూలు: కర్నూలు బి. క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, బి. క్యాంపు, కర్నూలుకు చెందిన ప్రథమ సంవత్సరం A&T (Accounting and Taxation) విద్యార్థి టి. వేణుగోపాల్ ఫుట్‌బాల్ క్రీడలో విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

నవంబర్ 21, 22, 23 తేదీలలో చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన SGF అండర్-19 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఎంపిక పోటీలలో కర్నూలు జిల్లా జట్టు తరఫున పాల్గొన్న వేణుగోపాల్ తన అద్భుతమైన ఆటతీరుతో ప్రతిభను చాటుకున్నాడు. అతని క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన ఎంపిక కమిటీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసింది. డిసెంబర్ 10 నుండి 20వ తేదీ వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ఈ సందర్భంగా విద్యార్థి సాధించిన విజయాన్ని అభినందిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మరియు అధ్యాపక బృందం వేణుగోపాల్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి కళాశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఆకాంక్షించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL