Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారుల విజ్ఞప్తి!
Kurnool: దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆలూరు తహసీల్దార్, ఎస్సై మన్మధ విజయ్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
Kurnool: దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని అధికారుల విజ్ఞప్తి!
కర్నూలు: దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అధికారుల సూచన...
కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆలూరు నియోజకవర్గంలోని ముద్దనగేరి, కరడిగుడ్డం గ్రామాల ప్రజలకు దేవరగట్టు బన్నీ ఉత్సవాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా భక్తిభావంతో స్వామివారిని దర్శించుకోవాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆలూరు తహసీల్దార్, ఆలూరు ఎస్సై మన్మధ విజయ్తో పాటు ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




