Alur: అరికేర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కుప్పగల్ నాగరాజు నామినేషన్!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కుప్పగల్ నాగరాజు గ్రామ సచివాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Bheemalinga, Aluru
Published on: 15 Nov 2026 2:26 PM IST
Alur
X

Alur: అరికేర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కుప్పగల్ నాగరాజు నామినేషన్!

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేర గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కుప్పగల్ నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ సచివాలయంలో అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కుప్పగల్ నాగరాజు మాట్లాడుతూ.. అరికేర గ్రామ ప్రజలు తనకు అవకాశం ఇచ్చి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రధానంగా బీటీ రోడ్లు, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థతో పాటు మౌలిక సదుపాయాలన్నింటినీ మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.

గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కుప్పగల్ నాగరాజు పేర్కొన్నారు. అరికేర గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్‌గా గెలిచి గ్రామానికి సేవ చేస్తానని ఆయన కోరారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru