Kurnool: శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

Kurnool: కర్నూలులో శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు కోరుతూ జేసీకి వినతిపత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్. అనుమతులు, ఫైర్ సేఫ్టీపై సమగ్ర తనిఖీలకు డిమాండ్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 21 Sept 2026 4:40 PM IST
Kurnool
X

Kurnool: శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

కర్నూలు: జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ పేరుతో నిర్వహిస్తున్న పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల గుర్తింపు, అనుమతులు, అఫిలియేషన్, ఫైర్ సేఫ్టీ, మౌలిక సదుపాయాలు లేని విద్య సంస్థలు సీజ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక విడుదల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కలసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎస్.ఈరేష్ బి.రంగస్వామి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నియమా నిబంధనలు పాటించకుండా నారాయణ, శ్రీ చైతన్య వివిధ ప్రైవేట్ విద్యాసంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పాఠశాల బ్రాంచ్ పర్మిషన్ తీసుకొని రెండు మూడు బ్రాంచ్లో తరగతులు నిర్వహిస్తున్న, విద్యార్థుల భద్రతకు అవసరమైన ఫైర్ సేఫ్టీ, భవన భద్రత, కనీస మౌలిక సదుపాయాలు లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఫీజుల వసూళ్లపై నిబంధనలకు అనుగుణంగా అధికారులు తనిఖీలు నిర్వహించి, తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్పెషల్ క్లాసులు పేరుతో రాత్రి 7 గంటల వరకు తరగతుల నిర్వహిస్తున్నారు.

శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ కర్నూలు జిల్లా సమితిగా విద్యార్థులందరిని సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష, కార్యదర్శి ఎస్.అభిషేక్ సి.అశోక్ జిల్లా సమితి సభ్యులు మధు, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL