Markapuram: గోపానుపల్లెలో ఇప్పటికీ జీవనాధారంగా చేదుడు బావి
Markapuram: కొమరోలు మండలం గోపానుపల్లెలో తాగునీటి అవసరాలకు చేదుడు బావే ఆధారమని, విరిగిపోయిన గిలకల దుంగలను అధికారులు బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Markapuram: గోపానుపల్లెలో ఇప్పటికీ జీవనాధారంగా చేదుడు బావి
మార్కాపురం జిల్లా: కొమరోలు మండలం లోని గోపాన్ పల్లె గ్రామంలో ఇప్పటికీ గ్రామంలోని చేదుడు బావిని వినియోగించుకుంటున్న ప్రజలు, పైపుల ద్వారా నీళ్ళు ఇంటింటికి కనెక్షన్లు ఉన్నా నీటికి ఇబ్బంది కలిగినప్పుడు, విద్యుత్ లేనప్పుడు వాడుకోవడానికి బావినీరే ఉపయోగించు కుంటామని స్థానికులు తెలిపారు.
చుట్టుపక్కల పొలాల్లో, గ్రామాల్లో ఎన్నో బావులు ఉన్న నీళ్లు లేని పరిస్తితి కానీ ఈ బావిలో నీళ్ళు దాదాపుగా ఎండిపోవని తెలిపారు. బావిపైన గిలకలు బిగించిన దుంగలు విరిగిపోయి నీళ్ళు చేదుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని అధికారులకు, పాలకులకు తెలిపినా ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.




