Kolimigundla: కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖాముఖి

Kolimigundla: కొలిమిగుండ్ల మండలం బెలుం బృందావన్ గార్డెన్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ శ్రేణులతో ముఖాముఖి నిర్వహించి, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేపట్టారు.

Ramanaiah, Banaganepalle
Published on: 16 Oct 2026 7:29 PM IST
Kolimigundla
X

Kolimigundla: కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖాముఖి

నంద్యాల జిల్లా: సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ, సమర్థులైన అభ్యర్థుల ఎంపికే లక్ష్యంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. కొలిమిగుండ్ల మండలం బెలుం బృందావన్ గార్డెన్‌లో నాయకులు, కార్యకర్తలతో టీడీపీ మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించి, గ్రామాల వారీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై ముఖాముఖి చర్చించారు.

గ్రామాల్లో పార్టీ పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ వంటి అంశాలపై వివరాలు సేకరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులతో చర్చిస్తూ, ప్రతి గ్రామం నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో స్థానిక పరిస్థితులు, ప్రజల మద్దతు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగేందుకు ఈ సమావేశం వేదికగా నిలిచింది.

సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాల సేకరణకు మంత్రి ప్రాధాన్యతనివ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామాల వారీగా నిర్వహించిన ఈ ముఖాముఖి ద్వారా స్థానిక పరిస్థితులపై స్పష్టత సాధించడంతో పాటు, సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా కసరత్తు చేపట్టారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle