Kodumuru: కోడుమూరులో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 5 ఎంపీటీసీ స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
Kodumuru: కోడుమూరులో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, కర్నూలు రూరల్ మండలాల్లో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగు మండలాల పరిధిలో మొత్తం 67 MPTC స్థానాలు ఉండగా, కర్నూలు రూరల్ మండలంలోని నందనపల్లె, పసుపుల, రుద్రవరం, జి.సిగవరం, నిడ్జూరు గ్రామాలకు చెందిన ఐదు MPTC స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
దీంతో మిగిలిన 62 MPTC స్థానాలతో పాటు నాలుగు ZPTC స్థానాలకు ఎన్నికల పోటీ కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.




