Kodumuru: కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వివరాలు వెల్లడి!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వివరాలు మరియు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.

C. Ganesh, Kodumuru
Published on: 21 Oct 2026 1:10 PM IST
Kodumuru
X

Kodumuru: కోడుమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వివరాలు వెల్లడి!

Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్థానాల వివరాలపై ఆసక్తి నెలకొంది. 2026 ఎన్నికల జాబితా ప్రకారం కోడుమూరు మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఉన్నాయి. సి.బెలగల్ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం. గూడూరు మండలంలో 7 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఉన్నాయి. కర్నూలు మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం ఉంది.

2026 జాబితా ప్రకారం కోడుమూరు, కర్నూలు మండలాల్లో జెడ్పీటీసీ స్థానాలు మహిళలకు (జనరల్), గూడూరు మండలంలో ఎస్సీ మహిళకు కేటాయించినట్లు పేర్కొన్నారు. సి.బెలగల్ మండల జెడ్పీటీసీ స్థానం అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru