Kodumur: కోడుమూరు రైతులకు గుడ్ న్యూస్.. రాయితీపై శెనగ విత్తనాలు
Kodumur: కోడుమూరు మండలంలో రబీ సీజన్‌కు 35% రాయితీతో క్వింటాల్ పప్పుశెనగ విత్తనాలను రూ.5,850కే రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు.
Kodumur: కోడుమూరు రైతులకు గుడ్ న్యూస్.. రాయితీపై శెనగ విత్తనాలు
Kodumur: రబీ సీజన్ కోసం ప్రభుత్వం 35 శాతం రాయితీపై పప్పుశెనగ విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామం రైతు సేవా కేంద్రంలో విత్తనాల నాణ్యతను రైతుల సమక్షంలో వ్యవసాయ అధికారి రవి ప్రకాష్ పరిశీలించారు.
కోడుమూరు మండలానికి తొలివిడతగా ప్రభుత్వం 750 క్వింటాళ్ల పప్పుశెనగ విత్తనాలను కేటాయించిందని మండలంలోని అన్ని గ్రామాలకు విత్తనాలు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
క్వింటా పూర్తి ధర 9,000 కాగా, 35 శాతం సబ్సిడీ 3,150. దీంతో రైతు కేవలం 5,850 చెల్లించాల్సి ఉంటుంది
పప్పుశెనగ విత్తనాలు అవసరమైన మండలంలోని రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ అనంతరం నిర్ణీత మొత్తాన్ని చెల్లించాలన్నారు. అనంతరం మండల కేంద్రంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించే ప్రారంభ కార్యక్రమంలో గ్రామాల వారీగా రైతులకు పప్పుశెనగ విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.రైతులు ఈ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.




