Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు!

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి డిసెంబర్ 9 వరకు కార్తీక మాసోత్సవాలు. గర్భాలయ అభిషేకాలు రద్దు, పలు రోజుల్లో స్పర్శదర్శనం నిలుపుదల.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 11 Nov 2026 8:51 AM IST
Srisailam
X

Srisailam: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు!

Srisailam: నిన్న అమావాస్య ఘడియలు ముగియడంతో గతరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశదీపం వెలిగించిన అర్చక స్వాములు, ఈఓ శ్రీనివాసరావు. కార్తీకమాసమంతా భక్తులరద్దీ కారణంగా గర్భాలయ అభిషేకాలు, సామూహిక ఆర్జిత అభిషేకాలు పూర్తిగా నిలుపుదలచేశారు.

పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలకు రూ. 216/- రుసుముతో నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబరు 20వతేది కార్తీక శుద్ధ ఏకాదశిరోజున దేవస్థాన ఆగమ పాఠశాల ఎదురుగా కోటి దీపోత్సవం కార్యక్రమంలో నిర్వహించనున్నారు.

కార్తీకమాసంలోని సోమవారాలలో లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం, లక్షదీపోత్సవం – పుష్కరిణి హారతి. నవంబరు 13న పాతాళగంగ వద్ద కృష్ణమ్మహారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

శని,ఆది,సోమవారాలు మరియు పర్వదినాలలో శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల చేశారు. సాధారణ రోజులలో నిర్దిష్టవేళలో అయిదు విడతలుగా స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించామని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM