Markapuram: మార్కాపురం జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి పేరు ప్రచారం!

Markapuram: మార్కాపురం జడ్పీ తొలి చైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నేత కందుల రామిరెడ్డి పేరు ప్రచారంలో ఉంది. దోర్నాల జడ్పీటీసీగా పోటీ చేసి భారీ మెజార్టీ సాధించేలా వ్యూహాలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 19 Oct 2026 9:03 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం జడ్పీ చైర్మన్‌గా కందుల రామిరెడ్డి పేరు ప్రచారం!

Markapuram: మార్కాపురం జిల్లా పరిషత్ తొలి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందా..? చైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నేత కందుల రామిరెడ్డి పేరు ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంత్రి నారా లోకేష్ సూచనప్రాయంగా రామిరెడ్డి పేరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

మరోవైపు, దోర్నాల మండలంలో తనకున్న పరిచయాలు, రాజకీయ సంబంధాలను బలంగా మలుచుకుని జడ్పీటీసీగా పోటీ చేసి బంపర్ మెజార్టీతో విజయం సాధించాలనే లక్ష్యంతో కందుల రామిరెడ్డి వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం, గతంలో పెద్దారవీడు జడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసివస్తాయని అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో తొలి జడ్పీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంటుందా..? దోర్నాల మండలంలో రామిరెడ్డి తన రాజకీయ బలాన్ని నిరూపించుకుంటారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, చైర్మన్ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM