Kallur: కల్లూరు అర్బన్‌లో రూ.2.63 కోట్ల పనులకు ఎమ్మెల్యే గౌరు చరిత శ్రీకారం
Kallur: కల్లూరు అర్బన్ పరిధిలో రూ.2.63 కోట్ల అభివృద్ధి పనులను పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితా రెడ్డి ప్రారంభించి భూమిపూజ చేశారు.
Kallur: కల్లూరు అర్బన్‌లో రూ.2.63 కోట్ల పనులకు ఎమ్మెల్యే గౌరు చరిత శ్రీకారం
కర్నూలు : కల్లూరు అర్బన్ 28 వ వార్డ్ లక్ష్మీపురం గ్రామం ఎస్సీ కాలని లో సామాజిక మరుగుదొడ్లకు రూ 40 లక్షల నిధులతో భవనం నిర్మాణం పూర్తి కావడం తో ముఖ్య అతిథులుగా పాల్గొని ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు.
అనంతరం కల్లూరు అర్బన్ 28 వ వార్డ్ పందిపాడు గ్రామం లో రూ 70 లక్షల నిధులతో సీసీ రోడ్ పనులకు మరియు కల్లూరు అర్బన్ 32 వ వార్డ్ ముజఫర్ నగర్ లో రూ 1 కోటి 53 లక్షలు NCAP నిధులతో రోడ్ వైడింగ్ పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఘనంగా భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమం లో ఏపీ విశ్వ బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ,లక్ష్మీపురం గ్రామ నాయకులు పుల్లారెడ్డి,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మారెన్న,రాధాకృష్ణ రెడ్డి,శివ, రామి రెడ్డి,వేముల హరి,కురువ మురళి,పoదిపాడు గ్రామ నాయకులు దేవేందర్ రెడ్డి,పాల శంకర్ రెడ్డి, అయ్యపు రెడ్డి,32 వ వార్డ్ నాయకులు టైలర్ నాగరాజు, ఖాజా బందే నవాజ్, మురళి గౌడ్, తలారి కృష్ణ నాయుడు,మా భాష, ఇబ్రహీం, మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ అధికారులు సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.




