Devanakonda: జనసేన పార్టీ సమీక్ష సమావేశం.. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం. కూటమి విజయం కోసం సమన్వయంతో పనిచేయాలని నేతల పిలుపు.

G Jagadeesh, Pathikonda
Published on: 11 Oct 2026 5:35 PM IST
Devanakonda
X

Devanakonda: జనసేన పార్టీ సమీక్ష సమావేశం.. స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం!

Devanakonda: దేవనకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశంకర్నూలు జిల్లా, దేవనకొండ: జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి తెర్నేకల్ వెంకప్ప ఆదేశాల మేరకు దేవనకొండ మండలంలోని జనసేన అతిథి గృహంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ నిర్వాహక దల్ కమిటీ సభ్యులు బోయ సరోజ, గాజుల జగదీష్, ఆంటోని లను అభినందించడం జరిగినది. అనంతరం నిర్వాహక సభ్యులు మాట్లాడుతు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ సన్నద్ధత, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై సమీక్షించారు.

గ్రామ , మండల స్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించడం జరిగినది. ఎన్డీఏ కూటమి లో భాగంగా కూటమి నాయకులతో సమన్వయంతో పనిచేస్తూ ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని వారు సూచించారు.

అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఐకమత్యంతో మరియు క్రమశిక్షణతో, పట్టుదలతో కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు ఏ ఉచ్చూరప్ప, నందు, బడే సాహెబ్, లక్ష్మన్న, రామాంజనేయులు, బంగి చంటి, బాలు, తిప్పన్న, రంగస్వామి, తిక్కయ్య, రంగస్వామి, కృపాకర్, రమేష్, బాలు, బ్రహ్మానంద, హబీబా, తేజ, భాష, వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda