Markapur: మార్కాపురం జడ్పీ పీఠంపై ఆసక్తికర చర్చ.. రేసులో ప్రముఖుల పేర్లు!
Markapur: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై టీడీపీ, కూటమి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలతో పాటు బీజేపీ రేసులో నిలిచింది.
Markapur: మార్కాపురం జడ్పీ పీఠంపై ఆసక్తికర చర్చ.. రేసులో ప్రముఖుల పేర్లు!
Markapur: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జడ్పీ పీఠం ఎవరికి దక్కనుందనే అంశంపై టీడీపీ, కూటమి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సామాజిక వర్గాల సమీకరణాలు, పార్టీ విధేయత, అధిష్ఠానం నిర్ణయం కీలకం కానున్నాయనే చర్చ వినిపిస్తోంది.
కమ్మ సామాజిక వర్గం నుంచి..
జడ్పీ చైర్మన్ పదవిని కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తే టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మన్నే రవీంద్ర , ప్రముఖ పారిశ్రామికవేత్త కోటపాటి జనార్ధన్రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
రెడ్డి సామాజిక వర్గం నుంచి..
రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే మార్కాపురం నియోజకవర్గ టీడీపీ క్లస్టర్ ఇన్చార్జి కందుల రామిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, పుల్లలచెరువు మండలానికి చెందిన శనగ నారాయణరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీజేపీకి కేటాయిస్తే ఏలూరి రామచంద్రారెడ్డి?
కూటమి సమన్వయంలో భాగంగా జడ్పీ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయిస్తే ప్రముఖ శాస్త్రవేత్త, రాష్ట్ర బీజేపీ మీడియా సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేరు తెరపైకి వస్తున్నట్లు సమాచారం.
అధిష్ఠానం నిర్ణయమే కీలకం!
వివిధ సామాజిక వర్గాల సమీకరణాలతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సర్దుబాట్లు, పార్టీ అధిష్ఠానం నిర్ణయం జడ్పీ చైర్మన్ ఎంపికలో కీలకం కానున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో ఎవరికి అవకాశం దక్కుతుంది? టీడీపీకే పీఠం దక్కుతుందా? లేక కూటమి సమీకరణాల్లో భాగంగా బీజేపీకి కేటాయిస్తారా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ పేర్లపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తుది నిర్ణయం వెలువడే వరకు జడ్పీ పీఠంపై ఉత్కంఠ కొనసాగనుంది.




