Kurnool: హొళగుంద జెడ్పీ హైస్కూల్‌లో ఎస్‌ఎంసీ ఎన్నిక రసాభాస
Kurnool: హొళగుంద జెడ్పీ హైస్కూల్‌లో కోరం లేకుండా ఏకపక్షంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఎన్నికను బహిష్కరించి తహశీల్దార్ వద్ద ధర్నా చేశారు.
Kurnool: హొళగుంద జెడ్పీ హైస్కూల్‌లో ఎస్‌ఎంసీ ఎన్నిక రసాభాస
కర్నూలు జిల్లా: హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నిక రాసాభస గా జరిగింది ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా కొందరు వ్యక్తుల నిర్ణయాల మేరకు ఎస్ ఎం సి ఎన్నికలు అధికారులు నిర్వహించడంతో ఎన్నికలో పోటీ చేయడానికి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనను తెలుపుతూ సమావేశ మందిరంలో నుండి ఎన్నికను బహిష్కరించి బయటకు లేచి వచ్చారు.
తమను పట్టించుకోనప్పుడు సమావేశానికి ఎందుకు పిలిచారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50% కోరం లేకపోయినా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజకీయాలకు తలవంచారని ఎన్నిక జరపకుండా ముందే సిద్ధం చేసుకున్న పేర్లను చదివి ఎన్నికైనట్లు ప్రకటించారని ఆరోపించారు.
కనీసం ఎవరు పోటీ చేస్తారు అని విద్యార్థుల తల్లిదండ్రులను అడగలేదని పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎన్నికల నియమ నిబంధనలను కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయలేదని పేర్కొన్నారు.
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి కోరం లేకుండా నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎంసి ఎన్నికను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగా ఎస్ ఎం సి ఎన్నికల్లో పాల్గొనేలా విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ ఎస్ ఎం సి ఎన్నికలను మరల నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తమ వినతి పత్రాన్ని తాసిల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కు అందజేసి జిల్లా కలెక్టర్కు పంపించి ఎస్ఎంసి ఎన్నికను మరల జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.




