Holagunda: జడ్పీటీసీ పీఠం స్వతంత్ర అభ్యర్థి ఈడిగా గోవిందు గౌడ్ కైవసం!

Holagunda: కర్నూలు జిల్లా హోళగుంద మండల జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఈడిగ గోవిందు గౌడ్ 1,570 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం. సంబరాల్లో అభిమానులు.

Bheemalinga, Aluru
Published on: 8 Nov 2026 9:45 AM IST
Holagunda
X

Holagunda: జడ్పీటీసీ పీఠం స్వతంత్ర అభ్యర్థి ఈడిగా గోవిందు గౌడ్ కైవసం!

Holagunda: కర్నూలు జిల్లా హోళగుంద మండల జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఈడిగ గోవిందు గౌడ్ ఘన విజయం సాధించారు. శనివారం ఆలూరులో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యం కనబరుస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధించారు.

మొత్తం 1,570 ఓట్ల భారీ మెజారిటీతో విజయం నమోదు చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి రాజకీయ పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి జడ్పీటీసీ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో హోళగుంద మండలంలో ఈడిగ గోవిందు గౌడ్ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఈ విజయంతో హోళగుంద మండల రాజకీయాల్లో స్వతంత్ర అభ్యర్థి సత్తా చాటారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru