Peddaraveedu: పెద్దారవీడులో టీడీపీ భారీ ర్యాలీ: ఎరిక్షన్ బాబు జోరు

Peddaraveedu: ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడులో టీడీపీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు నేతృత్వంలో చారిత్రాత్మక భారీ ర్యాలీ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Nov 2026 9:16 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడులో టీడీపీ భారీ ర్యాలీ: ఎరిక్షన్ బాబు జోరు

పెద్దారవీడు: ఒకప్పుడు వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా పేరొందిన పెద్దారవీడు మండలంలో టీడీపీ శ్రేణులు భారీగా కదం తొక్కాయి. మండల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పెద్దారవీడు గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని నాయకులు పేర్కొన్నారు.

టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు గొట్టం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, జడ్పీ చైర్మన్ అభ్యర్థి కందుల రామిరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి మెట్టు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జడ్పీటీసీ అభ్యర్థి చిలక చిన్న నానమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కందుల రామిరెడ్డి మాట్లాడుతూ గూడూరి ఎరిక్షన్ బాబు నాయకత్వంలో పెద్దారవీడు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ భారీ ర్యాలీలో మండల నాయకులు చిలక ఇజ్రాయిల్, గొట్టం రామనారాయణరెడ్డి, గొట్టం రఘునాథరెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రగుంట్ల నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు సుబ్బరామిరెడ్డి, తిరుమలరెడ్డి శేఖర్‌రెడ్డి, బీజేపీ నాయకులు కడియం రామయ్య, తిరుమల్‌రెడ్డి, జీవీ రెడ్డి, తిరుమలరెడ్డి ఆంజనేయరెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM